బీహార్‌ మార్పు కోరుకుంటోంది

పరివర్తన్‌ ర్యాలీలో లాలూ
పాట్నా, మే 15 (జనంసాక్షి) :
బీహార్‌ ప్రజలు మార్పు కోరుకుంటు న్నారని రాష్ట్రీయ జనతాదళ్‌ అధినేత లాలూ ప్రసాద్‌యాదవ్‌ అన్నారు. బుధవారం రాజధాని పాట్నాలో పరి వర్తన్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌పై ఆయన దుమ్మెత్తిపోశారు. ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌ గూటి చిలక అని ఆరోపణలు గుప్పించారు. ఆయన పాలనతో బీహారీలు విసుగెత్తిపోయా రని, ఇప్పుడు మార్పు కోరుకుంటు న్నారని తెలిపారు. బీహార్‌లో మార్పు తేవాలని కోరుతూ తాము పరివర్తన్‌ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. తా ము అధికారంలోకి వస్తే బీహారీలకు సుస్థిర పాలన అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కుమారులు తేజ్‌ ప్రతాప్‌, తేజస్వీలను తమ  పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులకు పరి చయం చేశారు. అయితే సొంతపార్టీలో పరివర్తన తెచ్చేందుకు, కుమారులను రాజకీయాల్లోకి తెచ్చేందుకే లాలూ పరివర్తన్‌ ర్యాలీ నిర్వహించారని అధికార జేడీ(ఎస్‌) దుయ్యబట్టింది.