బీహెచ్‌ఈఎల్‌లో కాంట్రాక్ట్ కార్మికుల మెరకు సమ్మె
మెదక్: జిల్లాలోని బీహెచ్‌ఈఎల్ రామచంద్రాపురం యూనిట్‌లో రెండు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు మెరుపు సమ్మెకు దిగారు. తనిఖీల పేరుతో కాంట్రాక్ట్ మహిళా ఉద్యోగులను సీఐఎస్‌ఎఫ్ సిబ్బింది వేధిస్తున్నారని ఆరోపించారు. మహిళలను వేధించిన సిబ్బందిని తొలగించే వరకు సమ్మె విరమించమని కాంట్రాక్ట్ ఉద్యోగులు యాజమాన్యానికి తేల్చి చెప్పారు. అధికారులు కార్మికులతో చర్చలు జరుపుతున్నారు.