బెంగళూర్ లక్ష్యం 118 పరుగులు
బెంగళూర్ : రాయల్ చాలెంజర్స్ బెంగళూర్‌తో జరుగుతున్న మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ దిగిన రాజస్థాన్ రాయల్స్ 19.4 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది. ద్రవిడ్ 35, బిన్నీ 33, రహానే 14, హాడ్జ్ 13 పరుగులు చేశారు. బెంగళూర్ బౌలర్లలో ఆర్పీసింగ్ ,వినయ్ కుమార్ మూడేసి వికెట్లు తీసుకున్నారు. రామ్ పాల్ రెండు వికెట్లు పడగొట్టాడు కార్తిక్ ,ఉందకత్ చెరో వికెట్ తీశారు.