బెజవాడలో హైటెక్ దొంగ అరెస్టు

బెజవాడలో హైటెక్ దొంగ ..టాటా, అంబానీలే ఆదర్శం నిందితుడిని, స్వాధీనం చేసుకున్న సొత్తును మీడియాకు చూపుతున్న సీపీ వెంకటేశ్వరరావు వీడియోకి క్లిక్ చేయండి


* రూ.20లక్షల సొత్తు స్వాధీనం
* ప్రతిభ చూపిన కానిస్టేబుల్‌కు ప్రశంసలు

విజయవాడ సిటీ : టాటా, అంబానీ, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అంతటి వాడిని కావాలని ఓ ఎంబీఏ పట్టభద్రుడు కలలు కన్నాడు. ఇందుకోసం అనేక వ్యాపారాలు మొదలు పెట్టి విజయం సాధించలేకపోయాడు. దీంతో దొంగతనాలను వృత్తిగా ఎంచుకొని ‘హైటెక్’ చోరీలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కాడు.

ఇందుకు సంబంధించిన వివరాలను పోలీసు కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావు ఆదివారం సాయంత్రం కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలియజేశారు. నిందితుని వద్ద నుంచి రూ.20లక్షల విలువైన రెండు కార్లు, మోటారు సైకిల్, రెండ్ ఐపాడ్‌లు, మూడు టీవీలు, ప్రింటర్‌తో కూడిన కంప్యూటర్, నాలుగు డిజిటల్ కెమెరాలు, 100గ్రాముల బంగారు నగలు, ఆరు కిలోల వెండి సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఇతనితో పాటు చోరీలకు వినియోగించే కార్లకు దొంగ నంబరు ప్లేట్లు బిగించే స్టిక్కరింగ్ షాపు యజమానిని కూడా అరెస్టు చేశామని పోలీసు కమిషనర్ తెలిపారు.