బెజ్జూరులో మావోయిస్టుల విధ్వంసం..
ఆదిలాబాద్ : జిల్లా బెజ్జూరు మండలం గూడెం సమీపంలో మావోయిస్టులు విధ్వంసం సృష్టించారు. రోడ్డు పనులు చేస్తున్న పలు వాహనాలను ధ్వంసం చేశారు. జేసీబీ, టిప్పర్, ట్రాక్టర్‌ను తగులబెట్టారు. దాదాపు పదిమంది మావోయిస్టులు ఈ పనిచేశారని స్థానికులు చెబుతున్నారు. మే 4, 5తేదీల్లో మావోయిస్టుల సభలున్నాయని రోడ్డు పనులు చేయొద్దని హెచ్చరించినట్లు తెలుస్తోంది. సిబ్బంది దగ్గరున్న సెల్‌ఫోన్లు తీసుకున్న మావోయిస్టులు అక్కడ ఓ కరపత్రాన్ని వదిలి వెళ్లారు. అందులో మైనింగ్ ప్రాజెక్టులు, పరిశ్రమలు స్థాపిస్తూ జిల్లా వనరులను దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రజల మాన ప్రాణాలు, ఆస్తులు కాపాడటానికి తాము పోరాటం చేస్తూనే ఉన్నామని తెలిపారు. మే 4, 5 తేదీల్లో బంద్‌కు పిలుపునిచ్చినట్లు ఈ లేఖలో రాశారు. భూనిర్వాసితులు సమస్యలతోపాటు.. గ్రీన్‌హంట్‌కు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని ఈ లేఖలో పేర్కొన్నారు.