బెల్టుషాపు తొలగించాలంటూ ఆందోళన

ఒంగోలు,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని గురిజేపల్లి గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న బెల్టు షాపు తొలగించాలని మహిళలు ఆందోళనకు దిగారు. మద్యం విక్రయిస్తున్న వారిని అరెస్టు చేయాలని ,మహిళ నాయకురాలు కళావతి గురిజేపల్లి గ్రామస్తులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు మార్కాపురం ఆర్‌ డి ఓ ఆఫీస్‌ ఆవరణలో ధర్నా చేసి ఆర్‌ డి ఓకి వినతి పత్రం అందజేశారు .ఈ కార్యక్రమంలో ఐద్వా మహిళా నాయకురాలు ఐ కళావతి, గ్రామస్తులు, గ్రామంలోని మహిళలు తదితరులు పాల్గొన్నారు.

 

తాజావార్తలు