బెల్టు షాపులపై అదనపు కలెక్టర్ కు ఫిర్యాదు

ములుగు జిల్లా

గోవిందరావుపేట సెప్టెంబర్ 19( జనం సాక్షి) :-

గోవిందరావుపేట మండలం లోని బెల్టు షాపులపై జిల్లా అదనపు కలెక్టర్ ( రెవెన్యూ) వై వి గణేష్, ఎక్సైజ్ సీఐ సుధీర్ కు టిఆర్ఎస్ యూత్ లీడర్ మువ్వ భాను ప్రకాష్ వినతి పత్రం సమర్పించారు.అనంతరం భాను ప్రకాష్ ట్లాడుతూ పస్రా గ్రామంలో బడి గుడి తేడాలేకుండా బెల్టు షాపుల నిర్వహణ జరుగుతుందని మండల లోని అన్ని గ్రామాల కంటే పస్రా గ్రామంలో బెల్టుషాపులు అధికంగా ఉన్నాయని  కొంతమంది పాన్ షాప్ లు కూల్ డ్రింక్ షాప్ ల పేరుతో  స్వేచ్ఛగా మద్యం అమ్మకాలు జరుపుతున్నారని ఉదయం నాలుగు గంటల నుండి బెల్టు షాపుల నిర్వహణ జరుగుతుందని యువత చెడు వ్యసనాలకు బలివ్వడానికి బెల్టుషాపులు కారణమని ఉదయం లేచిన కానుంచి బెల్టు షాపుల చుట్టూ తిరిగి మద్యం సేవించి నిత్యం మత్తులో ఉంటూ యువత భవిష్యత్తు కోల్పోతోంది అన్నారు.మద్యం వలన కొన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయి బెల్టుషాపుల లో మద్యం అమ్మకాలు ఇకనైనా నివారించి బెల్ట్ షాప్లకు స్థానిక వైన్ షాప్ వాళ్ళు సరుకు మండలం మొత్తం విచ్చలవిడిగా రవాణా చేస్తున్నారు కల్తీ మందు మరియు అధిక రేట్లకు విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలని పాన్ షాప్ ల లో నిషేధిత అంబర్,గుట్కాలు,అమ్మకాలు ఇకనైనా నిలిపివేయాలని అధికారులు ఇకనైనా స్పందించి చర్య తీసుకోవాలని  భాను ప్రకాష్ కోరారు.
ఫోటో రైట్ అప్ అదనపు కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చిన భానుప్రకాశ్ .

Attachments area