*బెల్టు షాపుల విక్రయాలతో లాభం ఎవరికి?
*అధికారులకు తెలిసే జరుగుతుందా, తక్కువ ధరలకు కొనుగోలు, ఎక్కువ ధరలకు అమ్మకాలు.
చిట్యాల18( జనంసాక్షి) ప్రభుత్వం మద్యం
దుకాణాలకు లైసెన్సులు ఇవ్వగా ఆయా
మండల కేంద్రాలలో
మద్యం దుకాణాలు పొందిన
వ్యక్తులు దుకాణాలు ఏర్పాటు
చేసుకొని ప్రభుత్వం నిర్ణయించిన
మద్యం ధరల కంటే ఎక్కువ ధరలకు గ్రామీణ ప్రాంతాలతో పాటు
చుట్టప్రక్కల ఉన్న పల్లెల్లో చిన్న చిన్న దుకాణాలు ఏర్పాటు చేసుకొని
జీవనం గడుపుకుంటున్న అమాయక ప్రజలకు విక్రయాలు జరుపుతూ
మద్యం దుకాణాల యజమానులు సొమ్ము చేసుకుంటూ ఉన్నారు. వివరాలలోకి పోతే మండలంలో ప్రభుత్వం 3 షాపులను ఏర్పాటు చేయగా అందులో ఒక షాపును వైన్ షాపుల యజమానులు బెల్టుషాపుల కే ఏర్పాటు చేశారు. దీంతో
ఆ మద్యాన్ని కొనుగోలు చేసిన చిన్న దుకాణాదారులు అమాయక ప్రజలకు
ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. ఇదంతా మండల కేంద్రంతో
పాటు చుట్టుప్రక్కల గ్రామాలలో మద్యం అమ్మకాలపై జీరో దందా
కొనసాగుతుంది. ప్రజలు బెల్టు షాపుల మద్యం అమ్మకాలను ఆపాలని, గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం గా తీర్మానం చేసిన కొన్ని రోజుల వరకే మూడు పువ్వులు ఆరు కాయలుగా వెదజల్లింది.మద్యం షాపుల
నుండి కొనుగోలు చేస్తున్న బెల్టుషాపుల చిరు వ్యాపారుల ఇళ్లలో వారు ఏర్పాటు చేసుకున్న సిబ్బంది ఎక్సైజ్ అధికారులు గా చలామణి అవుతూ మా షాపులోనే మందు కొనుగోలు చేయాలని అధిక ధరలకు అంటగడుతున్నారు. ఇంత జరుగుతున్నా ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు
బెల్టు షాపుల అమ్మకాలపై చర్యలు తీసుకోకపోవటం నెలవారి మామూల్లే కారణం. ఇప్పటికైన అధికారులు అక్రమ మద్యం అమ్మకాలు, బెల్టు
షాపులపై, ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే ఎక్కువగా అమ్మే మద్యం
దుకాణాలపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.