బెల్లంపల్లిలో ప్రజాఫ్రంట్ నేతల అరెస్టు
బెల్లంపల్లి పట్టణం: ఆదిలాబాద్ జిల్లా మందమర్రి కేకే2 ఉపరితల గనికి వ్యతిరేకంగా ప్రజాఫ్రంట్ నేతలు నేడు బంద్ పిలుపు ఇచ్చారు. ఈ ఉదయం ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమైన ప్రజాఫ్రంట్ నేతలను పోలీసులు అరెస్టు చేసి బెల్లంపల్లికి తరలించారు. అక్రమ అరెస్టుకు నిరసనగా ప్రజాఫ్రంట్ నేతలు పోలీసు స్టేషన్‌లో దీక్షకు దిగారు. అరెస్టైన వారిలో ప్రజాఫ్రంట్ నేతలు శ్రీమన్నారాయణ, ఎన్, కృష్ణ, ఇబ్రహీంతోపాటు ఉపరితల గని వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు.