బైక్‌ `ట్రాలీ ఆటో ఢీ: ఇద్దరు మృతి

వరంగల్‌ : జిల్లాలోని హసన్‌పర్తి వద్ద ఈ ఉదయం బైక్‌ను ట్రాలీఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.