బేటి బచావో  –    బేటి పడావో కార్యక్రమం పై  అవగాహన

బాలలకు ఆరోగ్య జాగ్రత్తలు, బాల కార్మిక నివారణకు సదస్సు  సంగారెడ్డి బ్యూరో , జనం సాక్షి , ఆగస్టు 22  ::::  జిల్లా మహిళ సాధికారత కేంద్రం (DHEW) అధ్వర్యంలో ZPHS పోతురెడ్డి పల్లి పాఠశాలలో మంగళవారం  బెటి బచావో – భేటీ పడవో స్కీమ్ గురించి,  మరియు బాలల హక్కులు, చట్టాలు, మరియు బాలలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, అక్రమా రవాణా, మరియు బాల్య వివాహాలు, బాలికల ఆరోగ్య జాగ్రత్తలు, బాల కార్మికుల నివారణ, బాలల హెల్ఫ్ లైన్ నెంబర్స్-1098, మహిళా హెల్ప్ లైన్ నెంబర్స్-181, మరియు 100 గురించి, తదితర అంశాలపై అవగాహన కల్పించడం జరిగింది.   ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జాకీర్ హుస్సేన్ , జిల్లా మహిళ సాధికారత కేంద్రం (DHEW) జిల్లా కో – ఆర్డినేటర్ పల్లవి , జెండర్ స్పెషలిస్ట్ యాదగిరి , విశాల , ఫైనాన్స్షియల్ లిట్రసీ హానిషా , పాఠశాల ఉపాధ్యాయుులు, విద్యార్థులు, చైల్డ్ హెల్ప్ లైన్ సిబ్బంది,అంగన్వాడి టీచర్, ఆశ కార్య కర్త, తదితరులు పాల్గొన్నారు.