బొగ్గు ఉత్పత్తికి అంతరాయం
గోదావరిఖని, జనంసాక్షి: విద్యుత్తు అంతరాయంతో జీడీకే 7ఎల్‌పీ గని కార్మికులకు అధికారులు మొదటి షివ్ట్‌లో సగం వేతనంతో కూడిన సెలవును మంజూరు చేశారు. రెండురోజుల క్రితం విద్యుత్తు ప్రమాదం జరిగి ఐదుగురు కార్మికులు గాయపడిన నేపథ్యంలో గనికి చెందిన విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయింది. దానికి మరమ్మతులు చేసి విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించారు. అయినా అధికారికంగా గనుల రక్షణ విభాగం అధికారుల నుంచి అనుమతి రాకపోవడంతో గనిలో విద్యుత్తు సరఫరాను నిలిఫరాను నిలిపివేశారు. దీంతో ఉదయం షివ్ట్ కార్మికులను విధులకు అనుమతించకుండా సగం జీతంతో కూడిన సెలవును ప్రకటించారు. అదేవిధంగా నిన్నరాత్రి షివ్ట్‌లో కూడా విద్యుత్తు సరఫరా లేకపోవడంతో వారికీ సెలవును ప్రకటించారు. దీంతో రెండు షివ్ట్‌లోనూ పని జరగకపోవడంతో ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.