బొగ్గు ఉత్పత్తి లక్ష్యమే ప్రధాన సవాల్
గోదావరిఖని, ఆగష్టు 16, (జనంసాక్షి):సింగరేణిలో నిర్దేశిత ఉత్పాదిత లక్ష్యాన్ని సాధించడానికి అధికారులు ప్రధాన సవాల్‌గా స్వీకరించారని… సింగరేణి సిఅండ్‌ఎండి సుతీర్థ భట్టాచార్య అన్నారు. గురువారం గోదావరిఖనికి వచ్చిన సందర్భంలో… సిఅండ్‌ఎండి భట్టాచార్య ‘జనం సాక్షి’తో మాట్లాడారు. బొగ్గుగనుల్లో కార్మికులు ఎటువంటి ప్రమాదాలకు గురికాకుండా… ఎప్పటికప్పుడు రక్షణ చర్యలను పర్యవేక్షించడానికి తగు ప్రణాళికను చేపట్టామన్నారు. రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించి, దేశంలో పారిశ్రామిక ప్రయోజనాన్ని చేకూర్చడానికి సింగరేణి భాగస్వామ్యం అవుతుందన్నారు. ప్రస్తుతం బొగ్గు మార్కెట్‌లో పోటీని తట్టుకోవడానికి సింగరేణిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా మెరుగుపరుచుకోవడానికి ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నామన్నారు. సింగరేణి వ్యాప్తంగా రీజియన్‌ల వారీగా బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని… పనితీరును పర్యవేక్షణ చేయడానికి ప్రత్యేక అధికారబృందం నిరంత రంగా పనిచేస్తుందన్నారు. కాగా, ఆర్జీ-1 జియం కార్యాలయంలోని కాన్ప Ûరెన్స్ హాల్‌లో సిఅండ్‌ఎండి ఈ ప్రాంత జనరల్ మేనేజర్లతో, కార్పొరేట్ వివిధ విభాగాల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పలు సంస్థాపరమైన కీలక విషయాలను సమావేశంలో అధికారులతో చర్చించినట్లు తెలుస్తోంది. నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించడానికి ముందు జాగ్రత్తలు తీసుకోవాలని వారికి సూచించినట్లు సమాచారం. సుదీర్ఘంగా జరిపిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే రామగుండం ఏరియాకు సిఅండ్‌ఎండి భట్టాచార్య రాకను ఆద్యం తం గోప్యంగా ఉంచారు. సిఅండ్‌ఎండి వెంట డైరెక్టర్(పా) పి.విజయ్ కుమార్, డైరెక్టర్(పిపి) రమేష్‌కుమార్, కార్పొరేట్ ఉన్నతాధికారులు మనోహ ర్‌రావు, పురుషోత్తం, జయకర్ తదితరులున్నారు. అలాగే తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరుతూ… సింగరేణి అధికారుల సంఘం ప్రతినిధి బృందం సిఅండ్‌ఎండిని కలిసి విన్నవించారు. ఇటీవల సింగరేణిలో కొన్ని యూనియన్ ప్రతినిధులు తమపట్ల దురుసుగా ప్రవర్తిస్తున్న తీరును ఏకరువు పెట్టినట్లు తెలిసింది.
హౌజ్ కమిటీ పర్యటన వాయిదా…
రామగుండం రీజియన్‌కు గురువారం రావాల్సిన శాసనసభ కమిటి పర్యటన వాయిదాపడింది. ఏ కారణం చేతనో.. ఈ కమిటి ఇక్కడికి రాకపోగా… వీరి పర్యటనకు సింగరేణి యాజమాన్యం పూర్తి ఏర్పాట్లు చేసింది. ఈ కమిటికి స్వాగతం పలకడానికి… సిఅండ్‌ఎండి సుతీర్థ భట్టాచార్య, డైరెక్టర్(పా) విజయ్‌కుమార్, ఇతర డైరెక్టర్లు గోదావరిఖనికి చేరుకోగా, అకస్మాత్తుగా వీరి పర్యటన వాయిదా పడినట్టు సమాచారం వచ్చింది. అయితే ఈ కమిటి పర్యటన 2, 3రోజుల్లో ఉండనున్నట్లు తెలుస్తోంది.