బొల్లారం డివిజన్

బొల్లారం, అక్టోబర్ 20(జనంసాక్షి):

స్థానిక బొల్లారం మున్సిపల్  పరిధిలోని పీహెచ్సీలో గురువారం “స్వచ్ఛతాకి దో రంగ్ర్” కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో కమీషనర్ రాజేంద్ర కుమార్ మాట్లాడుతూ, తడి చెత్త – పొడి చెత్త ను వేరు వేరుగా విభజించడం వలన పర్యావరణాన్ని కలుషితం కాకుండా ఏ విధంగా కాపాడుకోగలమో అవగాహన కల్పించారు. రెండు రంగులు గల చెత్త బుట్టలో వ్యర్ధాలను విభజించి సానిటైజ్ కార్మికులకు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ అధికారులు, పర్యావరణ ఇంజనిర్ సాయి కిరణ్ రెడ్డి, డాక్టర్ చంద్రశేఖర్ మరియు హాస్పిటల్  వైద్య సిబ్బంది పాల్గొన్నారు.