బోజ్యానాయక్‌ది ముమ్మాటికీ హత్యే!

వరంగల్‌ జిల్లా బందు ! విద్యార్థి అగ్నికి ఆహుతి. తెలంగాణకి మరొక సమిధ.. కరిగిపోతున్న యువత.తెలంగాణ చరిత్ర అంతా చావులేనా? హత్యలేనా ? మోసాలేనా ? తెలంగాణ ఉద్యమ పోరాటంలో మళ్లీ ఒక విద్యార్థి క్రూరంగా హత్య కావించబడ్డాడు. ఎవడు పోరాటం చేస్తున్నాడు తెలంగాణలో ఈరోజు ? వందల కొద్ది ప్రాణా లు పోగొట్టుకున్న వారే పోరాట యోధులు. నేను చచ్చి పోవడమో, నిన్ను చంపడమో చేస్తేనే పోరాటం అని నిర్వచించడం మనకు తెలు సు కాని నన్ను నేను చంపుకునే పరిస్థితులను నువ్వు కల్పిస్తే దానికి ‘పిరికితనం’ ఎందుకు అని పేరు పెడుతున్నాం ? ఇవ్వాళ తెలంగాణ ఉద్య మాన్ని నీరు కార్చి, చోద్యం చూస్తున్న పెద్దలం దరూ కూడా బోజ్య నాయక్‌ చావుకు కారకులే. ఎవరు ఉవ్వెత్తున లేచినా ఉద్యమానికి నీళ్లు చల్లింది. కేవలం ఎన్నికల ద్వారానే తెలంగాణ అంటే ఎందుకు మీరు డ్రామాలు ఆడి ‘చావో రేవో’ అని చచ్చు మాటలు చెప్పి సున్నిత మనస్కు లను ఉసి గొల్పినరు? అవును రేణుకా చౌదరికి తెలంగాణ అంటే ‘ఇన్‌స్టంట్‌ కాఫీనే’, ఎందుకంటే ఆమెకి ఇరాని చాయ్‌ తెలిసే అవకాశం లేదు. ఖమ్మం కమ్మ రాజ్యం నుండి ఆమెను రాజకీయ నాయకురాలిగా చేయడంలోనే ఇక్కడి పార్టీల వైఖరి స్పష్టం అవుతుంది.

అసలు ఖమ్మంలో, ఆదివాసీ ప్రాం తంలో తిష్ట వేసిన కమ్మలు ఎక్కడినుంచి వచ్చి నరు ? ఎవరి జాగలను ఆక్రమించుకున్నారు ? ఆకలితో అలమటిస్తున్న ఆదివాసీల ప్రాణాలను ఎవరు తీస్తున్నరు ? ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ రాజ్యమేలే వారిని ఏమి అనలేని మనం, ఇక్కడ పుట్టి, ఇక్కడ పరిపాలించి, తెలంగాణ చరిత్రకి ముఖ్య కారకులైన వారిని మతం పేరుతో ఎందు కు దూరం చేసుకుంటున్నాం? ఇదేమి నీతి? ఎంత మంది ముస్లిం యోధులు తెలంగాణ కొర కు ప్రాణాలు అర్పించలేదు. వారిని ఇవ్వాళ కనీ సం అధికారంలోకి రానివ్వకుండా విపరీత అర్థా లతోనో, సంక్షేమ పథకాలకో పరిమితం చేస్తు న్నాం. ఎవరి ప్రాణాలతో చెలగాటమాడే పోల వరం ప్రాజెక్ట్‌ను దగ్గరుండి ముందుకు నడిప ిస్తున్నారు? ఆదివాసీల ప్రాంతానికి కమ్మ రేణు కమ్మ ఎట్ల ప్రాతినిథ్యం వహిస్తది? ఏం చేసిందని రేణుకా చౌదరికి రాజ్యసభా పట్టం కట్టినరు ఏలినవారు ? ఆ గొప్ప రాజకీయ నాయకురాలు ఎన్నడన్నా కనీసం ఒక్క కార్యక్రమంలో జై తెలం గాణ అని అన్నదా ?ఈ విషయంపై అసలు తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్‌ వారికి చీమ కుట్టినట్లయినా ఉందా ? పిట్టలు నాలినట్టు పిల్ల లు, ఉద్యమకార్లు రాలిపోతుంటే, కుటుంబా లను రోడ్లమీద పడేసి, వాళ్లమీద ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులను జీవితాంతం ఏడ్వమని తీరునిచ్చి పోతున్న పిల్లలను చంపుతున్న ఈ నరరూప రాక్షసులకు శిక్ష పడేది ఎన్నడు? గుండె మండి, ఎవడిని ఏమి అనలేక చస్తుంటే తమను తాము శిక్షించుకొని మరీ జీవితాలని అర్పిస్తున్న వారికి ఈ నాయకులు రేపటి తెలంగాణ ఖచ్చితంగా ఇస్తామని కనీసం చెప్పలేకపోతున్నారు. ఎందుకు ఈ ఉద్యమం?ఎవడి కోసం? ఇన్ని ఘోరాలు చూసి కనీసం రాజీనామాలు చేయలేకపోతున్న నాయకులను సృష్టించుకున్నందుకు తెలంగాణ అంతా సిగ్గు పడాలి.

అసెంబ్లీ, పార్లమెంట్లు, ఉప ఎన్ని కలు అన్ని డ్రామాలు అయిపోయినాయి. ఇపుడు అసలు విషయాలు మాట్లాడుకునే పరిస్థితి వచ్చినది. కుత సంఘాల నాయకులారా, ప్రజా స్వామికవాదులారా, హక్కుల కోసం పరితపించే పౌరులారా, మనమందరమూ కూడా ఈ చావుల కు బాధ్యులమే. తెలంగాణ అంటే మాది కాదు కేవలం ఓట్ల కోసం, సీట్ల కోసం జరిగే తమాషా అని పక్కకు పెట్టడం సబబే కాని, ఈ చావులు ఎందుకు జరుగుతున్నాయి? అందులో నా తమ్ము లు దళిత, బహుజన, ఆదివాసి బిడ్డలే దాదాపు 90 శాతం ఎందుకున్నారు ? బోజ్యా నాయక్‌ రఘునాథరెడ్డి మండలం, వీరారెడ్డి తండా నుంచి న్యూ సైన్స్‌ కాలేజీలో ఎంబీఏ దాకా వచ్చాడంటే అది మామూలు మాట కాదు . ఉన్నత కుటుం బాలలో పిల్లలు అమెరికాకో, లండన్‌కో పోయి చదువుకోవడం చాల ఈజీ కాని కనీసం ఉన్నత విద్య దాకా రావాలంటే ఈ కులాలు ఎన్నో త్యాగాలు చేయాలే, ఎన్నో అవమానాలకు గురి కావాలే. ఫీజులు కట్టుకోవడానికి కూడా డబ్బులు లేక సెలవులలో కూలి పనులు చేయాలే. ఇన్ని చేసి డిగ్రీ చేత బట్టుకొని బయటికి వస్తే ఉద్యోగాలు లేవు. బతకనీకి జాగా లేదు అన్న చేదు నిజం ఒక శాపంలాగా నెత్తిన కూసుంది. అందుకే నాకు తెలంగాణ కావాలే అని ప్రాణం కన్న మిన్నగా ఆరాధించి, అలుపెరుగక పోరాటం చేస్తున్నారు. కాని ఈ దేశ రాజకీయాలలో బడు గు బలహీనులకు న్యాయం జరుగదు అన్న నీతిని తెలుసుకోలేక పోతున్నారు. అవును, నాయకు లను నమ్ముకుంటే తెలంగాణ వస్తదని జెండాలు మోసి మోసి అలసి పోయినారు బిడ్డలు. తనువు లు చాలించినరు. ఏమి చేయలేక గుడ్డ సంచి చేత పట్టుకొని గల్ఫ్‌ దేశాలకి, మహానగరాలకి కూళ్ళకు బోతున్నారు. పెళ్ళాం పిల్లలని పోషిం చుకోలేక, వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూడ లేక చచ్చి బతుకుతున్నారు. ఇక్కడ తెలంగాణ అంటే జీవితం, ఇక్కడి రాజకీయ నాయకులకి తెలంగాణ అంటే ఒక బంగారు బాతు గుడ్డు. ప్రాణాలకైనా వెనుకాడని ప్రజలకు పేపర్ల మీద సంతకాలు పెట్టలేని నాయకులు, ప్రజలను నిరా ్దక్ష్షిణ్యంగా చంపించి వేసే ప్రభుత్వాలకు తొతు ్తలుగా మారిన వాళ్ళు నాయకత్వం వహిస్తారు. నోటికొచ్చినట్టు మాట్లాడి ఎంతో మందిని పొట్టన బెట్టుకున్న వారినందరినీ శిక్షించాలి. తెలంగాణ ఏం చేస్తే వస్తదో అన్ని పార్టీలు తమ వైఖరిని వెంటనే రాత పూర్వకంగా పెట్టి ప్రజలకు హామీ కల్పించాలి. మేమే తెస్తాం అనే వాళ్ళని గత కొన్ని దశాబ్దాలుగా తెలంగాణ విని మోసపోతున్నది. రాకపోతే మేమే చస్తాం కాని మీరు చావకండి అని నాయకులు తెలంగాణకి హామీ ఇవ్వాలి. తెలంగాణ అంటేనే సున్నితం, ఉద్వేగం, ఆవేశం, ఆవేదన, ఇవి కల బోసుకొని రాత్రిం బవళ్లు తెలంగాణకై కలవరిస్తున్న విద్యార్థులకి, ఉద్యమ కారులకి ఒక స్పష్టమైన వైఖరితో ఇక్కడి బడుగు, బలహీన, మైనారిటీ, ఆదివాసీ, మహిళల ప్రాతినిథ్యంతో కూడుకున్న తెలంగాణని తేవడంలో మా పాత్ర అని బహిరంగంగా చెప్పాలి. వీడిని వాడు తిట్టుకొని, వాడిని వీడు తిట్టుకొనె డ్రామాలు ఇంక ఆపేయాలి. వనరులు దోపిడిని చోద్యంగా చూస్తూ, కేంద్రం, ఆంధ్రా నాయకుల చేష్టలని ప్రశ్నించకుండా వదిలివేస్తున్న వారు ఎప్పటికీి తెలంగాణ తేలేరు. ఇది నిజం, ఇదే నిజం. మళ్లీ ఒకసారి తెలంగాణని మోసం చేయడానికి అన్ని రాజకీయ పార్టీలు కుమ్మక్కై, అగరాకుల శక్తులు ఒక్కటై 2014లో తెలంగాణని అడ్డం పెట్టుకొని రాజ్యాధికారంలోకి వచ్చి మరిం త అణచివేతలకి పాల్పడడానికి పథకాలు పన్ను తున్నై. వీటిన్నిటిని తొప్పికొట్టాల్సిన బాధ్యత మన అందరి పైనా ఉన్నది.

అన్ని పార్టీలు తెలంగాణ ప్రజలకు నీటి మూటల మాటలు కాకుండా తెలంగాణ వచ్చేటందుకు ఏమి చేస్తారో చెప్పేదాకా అన్ని సమూహాల వారు ఒత్తిడి తేవాలి. లేకపేతే మరిన్ని ప్రాణాలు పోగొట్టుకొనే ప్రమాదం ఉంది. విద్యార్థి సంఘాలు కూడా పార్టీల జోలికి పోకుండా తెలం గాణ తెచ్చే క్రమంలో ఒక పెద్ద శక్తిగా ఎదిగి పార్టీలకు చెక్‌ పెట్టే విధంగా ఉండాలి. అందరిని విడదీయడం, అడ్డు తొలగించుకోవడం పార్టీల నైజం, వాటిని విశ్లేషించి ఉద్యమానికి ఊపిరిగా అందరిని ఒక్క తాటిపై నిలబెట్టే చైతన్యం తీసుకు రావాల్సింది మనం అందరం. మనలో మనకి ఎన్ని భేదాభిప్రాయాలున్నా కూడా తెలంగాణని ఇప్పుడు కాపాడకపోతే ఇంకెప్పుడు కాపాడలేము. ఇన్ని వందల ప్రాణాలకు జవాబుదారి తనాన్ని తీసుకురాలేము. విద్యార్థులు రాజకీయ శక్తిగా ఎదిగితే కూడా బాగుంటుందేమో ఆలోచించాలి. తెలంగాణ అడుక్కుంటే వచ్చేది కాదు. ఒక హక్కు, ఒక న్యాయం. ప్రాణాలు తీసుకునే హక్కు ఎవరికీ లేదు. పోరాడి సాధించే దిశగా అందరిని తయారు చేయాల్సిన బాధ్యత తెలంగాణ సంఘాల మీద ఎక్కువ ఉంది. మౌనం ఇపుడు చాల విలువైనది దొరలారా ! అది ప్రాణ లను కూడా తీస్తుంది ! కొన్ని కులాల ప్రాణాలను మాత్రమే తీసేటట్టు తయారయితుంది. గొప్పో ళ్లకు ఉన్న తెలివితేటలు అందరికీ రావడానికి చానా సమయం పడుతుంది. నోరు విప్పండి దయ చేసి, ఉద్యమాన్ని లేపండి, దోపిడీ దారులను, దగాకోరులను తరిమి వేయండి ! లేకపోతె చరిత్ర మిమ్మల్ని క్షమించదు.

తెలంగాణ వీర భక్తుల్లారా వ్యక్తీ ఆరాధనా, భజన మానివేస్తే నిజాలు కనప డతాయి. వాటిని బయటికి తీయండి. అమా యకులను యుద్ధానికి సిద్ధం చేద్దాం ! చావుకు కాదు !

జై తెలంగాణ !

సుజాత సూరేపల్లి

తాజావార్తలు