బోడు కేంద్రంగా మండలాన్ని ఏర్పాటు చేయాలి
–బంద్ సందర్బంగా అఖిల పక్షం నేతల డిమాండ్
— బోర్డులో అఖిలపక్ష ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
టేకులపల్లి, ఆగస్టు 30( జనం సాక్షి ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలోని టేకులపల్లి మండల పరిధిలో గల బోడు కేంద్రంగా మండలం ఏర్పాటు చేయాలని కోరుతూ మంగళ వారం అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్ ను నిర్వహించారు. ఈ బందు నిర్వహణకు చుట్టుపక్కల పలు గ్రామాల నుండి భారీగా జనం కదిలి వచ్చారు. బోడును మండల కేంద్రంలో ఏర్పాటు చేసే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదంటూ మహిళలు సైతం భారీగా కదిలి వచ్చారు. ఈ బంధు సందర్బంగా బోడు మండల సాధన కమిటీ కన్వీనర్ ఎట్టి నర్సింహా రావు, టేకులపల్లి మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు భూక్య రాధ, బోడు సర్పంచ్ ఇరప లక్ష్మీనారాయణ, అన్నారపు సత్యనారాయణ లు మాట్లాడుతూ బోడు ప్రాంతం మండల కేంద్రం టేకులపల్లికి 25 కిలోమీటర్ల దూరం ఉన్నదని,దీనివలన ప్రభుత్వ కార్యాలయాల్లో చిన్న చిన్న పనులకు కూడా వారం రోజులపాటు అనేక వ్యయ ప్రయాసాలకు గురై తిరగవలసి వస్తుందని అన్నారు. బోడు ప్రాంతంలోని చాలా గ్రామాలకు రవాణా సౌకర్యం కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈసమస్యపై స్థానిక శాసన సభ్యురాలకు అనేక సార్లు వినతిపత్రం సమర్పించామని, మంత్రులకు కూడా వినతిపత్రం ఇచ్చామని ఐనా స్పందించలేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు,ప్రజాప్రతినిధులు స్పందించి బోడు మండల ఏర్పాటుకు కృషిచేయాలని కోరారు. లేకపోతే అఖిలపక్షం ఆధ్వర్యంలో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. న్యూడెమోక్రసీ గ్రామా కమిటి కార్యదర్శి,కొమరారం మండల సాధన కమిటీ కన్వీనర్ వి.మోతిలాల్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
అన్ని అర్హతలు ఉన్నా ఇల్లందును రెవిన్యూ డివిజన్ గా చేసి అభివృద్ధి చేయాలనీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వైఖరికి నిరసనగా కొమరారం,బోడు ప్రాంతాలతో పాటు ఇల్లందు పట్టణంలో బంద్ నిర్వహిస్తున్నామని, ఈ బంద్ లో పాల్గొన్న అన్ని రకాల వ్యాపారవర్గాలకు, వాహనాదారులకు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుంజ సాంబశివరావు,పోతుగంటి వీరభద్రం,మాడే బాబు, మీణుగు జనార్దన్,మీణుగు సురేష్,ఈసాల రవి, పెనకరామస్వామి, చిలివేరు చంద్రశేఖర్,ప్రశాంత్, రాంబాయి, సాయమ్మ,కళావతి, నర్సింహారెడ్డి, శ్రీనివాస్,సైదులు, భాస్కర్,రాములు, సతీష్,వివిద రైతు,మహిళ, యువకుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.