బోథ వెంకటేశ్వర ఆలయంలో ధాత్రి నారాయణ పూజలు

బోథ్ (జనంసాక్షి) నవంబర్ 09. బోథ్ మండల కేంద్రంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 12 వ తేదీ శనివారం శ్రీ ధాత్రి నారాయణ స్వామి (తునసి, ఉసిరి నారాయణ స్వామి) పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు దోణే సదానంద్ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం కార్తీక వన భోజనాలు ఉంటాయని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి క్రుపా కటాక్షాలు పొందాలని ఆయన విజ్ఞప్తి చేశారు.