బోర్లు నిర్మాణం చేయపోవడంతో సాగునీటి వసతి లేదని దళితుల ఆందోళన
గంగాధర: ఇందిర జలప్రభ కింద దళితులకు కేటాయించిన వ్యవసాయ భూముల్లో సాగునీటి వసతి కల్పించడం లేదని మండలంలోని ఉప్పరమల్యాల గ్రామానికి చెందిన దళిత రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం దళిత కాలనీలో నిర్వహించిన ఇందిరమ్మ కలలు కార్యక్రమంలో గ్రామస్థులు పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. బోర్లు నిర్మాణం చేయకపోవడంతో సాగునీటి వసతి లేఖ భూములు బీడుగా వదిలేశామని ఈ సందర్భంగా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు నెలల క్రితం రెండు బోర్ల నిర్మాణం జరిగినా విద్యుత్తు మోటార్లు ఏర్పాటు చేయలేదని, ఫలితంగా అవి నిరుపయోగంగా మారాయని అన్నారు. కురిక్యాలలో ప్రభుత్వ స్థలాలు ఉన్నా ఇళ్ల నిర్మాణానికి పట్టాలు ఇవ్వడం లేదని ఎమ్మెల్యే సుద్దాల దేవయ్యకు దళితులు మొరపెట్టుకున్నారు.