‘బ్యాంకు మిత్ర ‘ భారం!
మహిళ సంఘాల సాయం కోసం నియమించిన ‘బ్యాంకు మిత్రల’ భారాన్ని తాజాగా గ్రామైక్య సంఘాలపై మోపడంతో వీఓలు లబోదిబోమంటున్నారు. మండల సమాఖ్యల నుంచి గ్రామైక్య సంఘాలకు గతంలో ఇచ్చిన జీతాలను రికవరీ చేయడంతో పాటు, ఇకముందు చెల్లించబోయే జీతాల భారాన్ని సైతం వీవోలపైనే మోపుతుండడంపై విమర్శలు వెల్లు మరోవైపు ఆడిటింగ్‌లో వివిధ మండల సమాఖ్యల్లో భారీ అక్రమాలు వెలుగుచూస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.
మండలంలోని అన్ని గ్రామైక్య సంఘాలను ముందుకు నడిపించడం, మహిళ సంఘాలకు బ్యాంకు రుణాలు ఇప్పించి తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వ పథకాలను మహిళా సంఘాలకు వర్తింపచేయడం బ్యాంకు మిత్రల పని చిన్న మండలానికి ఒక్కరు. పెద్ద మండలానికి ఇద్దరు, ముగ్గురు, నలుగురేసి చొప్పున ఉండే వీరికి తలా రూ జీతం ఇస్తున్నారు. మండల సమాఖ్యలు ఏర్పడ్డాక, ప్రతి మండల సమాఖ్యకు ప్రభుత్వ రూ. 30లక్షల చొప్పున కేటాయించింది. ప్రభుత్వం కేటాయించిన ఈ నిధులను గ్రామైక్య సంఘం సభ్యులకు రూపాయి చొప్పున వడ్డీకి అప్పు ఇవ్వాలి. వచ్చిన వడ్డీ డబ్బులోంచి 50పైసలు
మండల సమాఖ్మకు చెల్లించాలి. మండల సమాఖ్యకు వస్తున్న మొత్తంతో అక్కడ పని చేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్, అకౌంటెంట్, అంటెడర్ జీతాలు చెల్లించడంతో పాటు మండల సమాఖ్య ఆర్థికంగా నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.