బ్యాగుల భారం తగ్గించే చర్య మంచిదే

చిన్నపిల్లలకు చదువుల మోతపై ఎట్టకేలకు కేంద్రం ఆలస్యంగానైనా స్పందించింది. వారి మెదడుకు మించి భారం మోపుతున్న చదువులపై ఇంతకాలం ఎవరు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. వీపులు ఒంగి పోయేలా పుస్తకాల మోత మోగిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. చిన్నారులపై పుస్తకాలు, ¬ంవర్క్‌ ఒత్తడి పెరుగుతున్న చోద్యం చూస్తున్నారు. ఈ దశలో ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు ఎలాంటి ¬ంవర్క్‌ ఇవ్వరాదని కేంద్రమానవ వనరుల శాఖ తాజాగా ఇచ్చిన ఆదేశాలు ఉపశమనం కలిగించేవే. ఈ తరగతులకు చెందిన విద్యార్థుల పాఠశాల బ్యాగు బరువు 1.5 కిలోలకు మించరాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ మేరకు పాఠశాల బ్యాగుల బరువు, బోధనాంశాల నియంత్రణకు సంబంధించిన మార్గదర్శకాలు రూపొందించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ తాజాగా ఆదేశాలు జారీచేసింది. ఈ మార్గదర్శకాలు తాము జారీచేసిన సూచనల మేరకు ఉండాలని తెలిపింది. అయితే గతంలో కూడా ఇలాంటి ఆదేశాలు ఉన్నాయి. వాటిని అమలు చేయకపోతే ఏం చేయబోతున్నారో..ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలి. ఎలాంటి కఠన చర్యలు ఉంటాయో వివరించాలి. నిబంధనలు ఉల్లంఘించిన పాఠశాలలపై తీసుకునే చర్యలను చెబితే తప్ప ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాల తలకెక్కదు. ఇక్కడ అమలు చేయడం కన్నా ఉల్లంఘనలపైనే ప్రధాన చర్యలు ఉండాలి. అన్ని పాఠశాలలు ¬ంవర్క్‌, స్కూల్‌ బ్యాగుల బరువుకు సంబంధించి తమ సూచనలను వెంటనే అమలు చేయాలని కూడా ఆదేశించింది. బోధనాంశాలకు సంబంధించి.. ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు భాషలు, గణితం తప్ప మరే ఇతర సబ్జెక్టులను బోధించరాదని మానవవనురల శౄఖ స్పష్టంగా తెలిపింది. 3 నుంచి 5 తరగతుల విద్యార్థులకు భాషలు, గణితం, పర్యావరణ శాస్త్రం తప్ప మరే సబ్జెక్టులను బోధించరాదని స్పష్టంచేసింది. ఈ సబ్జెక్టులు కాకుండా ఇతర అదనపు పుస్తకాలు లేదా అదనపు బోధనా సామగ్రిని విద్యార్థులకు ఇవ్వడానికి పాఠశాలలకు అనుమతి లేదని తెలిపింది. నిజానికి ప్రైవేట్‌ పాఠశాలల్లోనే ఇలాంటి నిబందనలు ఎక్కువ. లెక్కకు మిక్కిలి వారికి పుస్తకాలను కట్టబెట్టి, మెదడుకు ఎక్కనంతగా పాఠ్యాంశాలను రుద్దుతున్నారు. వారి చిన్నారి మెదడు చిట్లిపోయేలా పాఠ్యాంశాలను రుద్దుతున్నారు. ఇలాంటి పాఠ్యాంశాలపై అజమాయిషీ లేకుండ ఆపోయింది.

విద్యార్థుల పాఠశాల బ్యాగు బరువుకు సంబంధించి కూడా ఎంహెచ్‌ఆర్డీ స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. దీనిప్రకారం ఒకటి, రెండు తరగతుల విద్యార్థుల పాఠశాల బ్యాగు బరువు 1.5 కిలోలకు మించరాదు. 3 నుంచి 5 తరగతుల విద్యార్థుల స్కూల్‌ బ్యాగు బరువు 2 నుంచి 3 కిలోలు మించరాదు. 6 నుంచి 7 తరగతుల విద్యార్థుల పాఠశాల బ్యాగు బరువు 4 కిలోలు, 8 నుంచి 9 తరగతుల విద్యార్థుల బ్యాగు బరువు 4.5 కిలోలు, పదో తరగతి విద్యార్థుల బ్యాగు బరువు 5 కిలోలు మించకూడదు. పాఠశాల విద్యార్థుల బ్యాగుల బరువు నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీచేయాలని ఈ ఏడాది మేలో మద్రాస్‌ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. దీంతోపాటు ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు ¬ంవర్క్‌ ఇవ్వకుండా ఉండే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని తెలిపింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం చర్యలు చేపట్టింది. కాగా అంతకు ముందు కేంద్రం జారీచేసిన పలు ఆదేశాలు సరిగా అమలుకాలేదు. 2015లో కూడా బ్యాగుల బరువు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం పలు మార్గదర్శకాలు జారీచేసింది. విద్యార్థుల బ్యాగుల బరువు తగ్గించే పలు పద్ధతులను అమలు చేయాలని 2016 ఏప్రిల్‌లో సీబీఎస్‌ఈ తన అనుబంధ పాఠశాలలకు నోటీసులు జారీచేసింది. పుస్తకాల సంఖ్యను తగ్గించేందుకు 25

కేంద్రీయ విద్యాలయాల్లో 2016లో ఎంహెచ్‌ఆర్డీ ఓ పైలట్‌ ప్రాజెక్టును అమలు చేసింది. ప్రభుత్వ పాఠశాలలతో పోలిస్తే ప్రైవేట్‌ పాఠశాలల్లోనే డొల్లతనం ఎక్కువగా ఉంటోంది. ప్రధానంగా గ్రావిూణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో ఉన్న చురకుదనం, నైపుణ్యం ప్రైవేట్‌ విద్యను అభ్యసిస్తున్న పట్టణ ప్రాంత విద్యార్థుల్లో కనిపించడం లేదు. నిరంతర సమగ్ర మూల్యాంకనం సందర్భంగా చేపట్టిన సర్వేలో ఇది బయటపడింది. ప్రధానంగా సృజనాత్మకత అన్నది ప్రైవేట్‌ విద్యార్థుల్లో కొరవడింది. సీసీఈ అమలు తీరులో లోపాలు వెలుగులోకి వచ్చాయి. మార్కులు తక్కువ వస్తే పాఠశాల పేరు పడిపోతుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను మరో పాఠశాలకు పంపించే అవకాశం ఉంటుందని ప్రైవేట్‌ పాఠశాలలు మార్కులు వేస్తున్నాయి తప్ప, నిరంతర సమగ్ర మూల్యాంకన పద్ధతిని అనుసరించడం లేదని తేల్చాయి. ప్రైవేట్‌ పాఠశాలల్లో సీసీఈపై అవగాహన లేకపోవడం.. పాఠశాల యాజమాన్యాలు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వకపోవడం వల్ల ప్రభుత్వ ఉద్దేశం పక్కదారి పడుతోందని గుర్తించారు. సిసిఇ అమల్లో ప్రైవేట్‌ పాఠశాల లు వెనుకబడ్డాయి. వీటిల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు అసలు ఈ విధానంపై అవగాహనే లేదని పర్యవేక్షక కమిటీ బృందాలు తేల్చిచెప్పాయి. ప్రభుత్వ పాఠశాలల్లో దీని అమలు బాగుందని స్పష్టం చేశాయి. వీటిని కప్పిపుచ్చుకోవడానికి అన్నట్లు పుస్తకాలు, బ్యాగుల మోతతో పిల్లపై భారం మోపుతున్నారు. ఇలాంటి పటాటోపం తగ్గించేందుకు పుస్తకాల మోతను కుదించాలన్న ఆలోచన కఠినంగా అమలు చేయాల్సిన బాద్యత ప్రభుత్వాలపై ఉంది. ఆదేవాలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకునేలా చూడాలి. అప్పుడే పిల్లలపై పుస్తకాల మోత తగ్గుతుంది. ఆ దిశగా చర్యలకు ఉపక్రమించాలి.