బ్రిగేడియర్‌ విష్ణు శర్మ పాత్రలో సుమంత్‌

అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోలలో సుమంత్‌ ఒకడు. అప్పట్లో ఈయనకు విపరీతమైన ఫాలోయింగ్‌ ఉండేది. సత్యం, గౌరి, ధన51, గోదావరి వంటి సినిమాలతో యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ ఏర్పరుచుకున్నాడు. చాలా కాలం తర్వాత మళ్ళీరావా చిత్రంతో వచ్చాడు. కమర్షియల్‌గా ఈ చిత్రం ఘన విజయం సాధించకపోయినా, సుమంత్‌ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం ఈయన అనగనగా ఓ రౌడి అనే యాక్షన్‌ సినిమాను చేస్తున్నాడు. ఇదివరకే చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై మంచి బజ్‌ క్రియేట్‌ చేశాయి. ఇదిలా ఉంటే ఈయన దుల్కర్‌ సల్మాన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న సీతారామంలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. తాజాగా ఈయన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఈ చిత్రంలో బ్రిగేడియర్‌ విష్ణు శర్మ పాత్రలో సుమంత్‌ నటిస్తున్నాడు. తాజాగా విడుదలైన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో సుమంత్‌ ఆర్మీ అధికారిగా విూసం కట్టుతో ఆకట్టుకుంటున్నాడు. లేటెస్ట్‌గా విడుదలైన ఈ పోస్టర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వస్తుంది. ఇటీవలే విడుదలైన టీజర్‌కు అనూహ్య స్పందన వచ్చింది. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దుల్కర్‌ లెప్టినెంట్‌ రామ్‌ పాత్రలో నటిస్తున్నాడు. మృనాళ్‌ థాకూర్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న కాశ్మీర్‌ ముస్లిం అమ్మాయిగా కథను మలుపు తిప్పే పాత్రలో నటిస్తుంది. స్వప్న సినిమాస్‌ బ్యానర్‌పై స్వప్న దత్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి పి.ఎస్‌ వినోద్‌ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఆగస్టు 5న విడుదల కానుంది.