బ్రిడ్జిపై నుంచి కింద పడ్డ కారు : ఒకరు మృతి

ఆదిలాబాద్ : నేరడిగొండ మండలం కోరిటకల్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. నిర్మల్ నుంచి ఆదిలాబాద్ వైపు వస్తుండగా అదుపు తప్పిన కారు బ్రిడ్జి పైనుంచి కింద పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.