భగత్ సింగ్ జయంతిని అధికారికంగా నిర్వహించాలి

– ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు జుజ్జురి వేణు కుమార్

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో భగత్ సింగ్ పాత్ర ఎంతో కీలకమైందని, అంతటి మహోన్నతనమైన భగత్ సింగ్ జీవిత చరిత్ర యావత్ సమాజానికి తెలిసే విధంగా పాఠ్యాంశాలలో చేర్చాలని భారత విద్యార్థి సమైక్య జిల్లా ఉపాధ్యక్షులు జుజ్జురి వేణు కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.భగత్ సింగ్ జయంతి , వర్దంతిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలన్నారు.భగత్ సింగ్ కి భారతరత్న ప్రకటించాలని కోరారు.తెలంగాణ ప్రభుత్వం భగత్ సింగ్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ ఆక్ట్ ఏర్పాటు చేయాలన్నారు.మాతృభూమి విముక్తి కోసం దేశ ప్రజల స్వేచ్ఛ కోసం బ్రిటిష్ పరిపాలనపై తిరుగుబాటు చేసిన నునుగు మీసాల యుక్త వయసులో ఉరికంబాన్ని సైతం నవ్వుతూ ముద్దాడిన వీరకిషోరం షాహిద్ భగత్ సింగ్ అని అయన కొనియాడారు.ఆయన పోరాట పటిమను భావితరాలకు అందించవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు.సెప్టెంబర్ 28న భగత్ సింగ్ 115వ జయంతి ఉత్సవాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంగా నిర్వహించాలని కోరారు.