భగత్ సింగ్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన పీడిఎస్యూ నాయకులు దేవేందర్

*భగత్ సింగ్  జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన పీడిఎస్యూ నాయకులు దేవేందర్*
బయ్యారం,సెప్టెంబర్28(జనంసాక్షి):
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం వాసవి డిగ్రీ కళాశాల లో కామ్రేడ్ భగత్ సింగ్ 115వ, జయంతి నిర్వహించారు.
ఈ సందర్భంగా పిడిఎస్యు జిల్లా నాయకులు దేవేందర్ మాట్లాడుతూ.. విప్లవ ఉత్తేజం షాహిద్ భగత్ సింగ్  ఆయన ఆశయ సాధనలో యువత ముందుండాలని పిడిఎస్యు జిల్లా నాయకులు దేవేందర్ పిలుపునిచ్చారు.
కామ్రేడ్ భగత్ సింగ్ 115వ, జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. సమ సమాజమే మా ధ్యేయం సామ్రాజ్యవాదం మాకు బద్ధ శత్రువు సాయుధ పోరు ధోరణి దేశానికి విముక్తి సాధ్యం సోషలిజం అంతిమ లక్ష్యం అంటూ ప్రపంచానికి ధైర్యంగా తమ ప్రణాళికను పోరాట మార్గాన్ని ప్రకటించిన వీరుడు భగత్ సింగ్ అని ఆయన సేవలను కొనియాడారు. భగత్ సింగ్ 23 సంవత్సరాల చిరుప్రాయంలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప దేశభక్తుడని దేశభక్తి అంటే దేశ సంపదను కాపాడుకోవడమని, పరాయి దేశానికి తాకట్టు పెట్టడం కాదని  తేల్చి చెప్పాడన్నారు. దేశ సంపదను కార్పొరేట్లకు అప్పచేప్పుతున్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడమే భగత్ సింగ్ కు  మనమిచ్చే నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో  ప్రశాంత్, పవన్, సాయి, నరేష్, మునీందర్, తదితరులు పాల్గొన్నారు.