భగత్ సింగ్ పోరాట స్ఫూర్తిని కొనసాగిద్దాం
ఆప్ జిల్లా ఇన్ఛార్జ్ డాక్టర్ కళ్లేపల్లి నరేష్
సూర్యాపేట టౌన్ ( జనంసాక్షి ): భగత్ సింగ్ జయంతిని పురస్కరించుకొని బుధవారం స్థానిక శ్రీ సాయి బ్లడ్ బ్యాంక్ నందు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు రక్తదానం కార్యక్రమం నిర్వహించారు.ఈసందర్బంగా ఆ పార్టీ జిల్లా ఇన్చార్జి డాక్టర్ కళ్లేపల్లి నరేష్ మాట్లాడుతూ ఆప్ జాతీయ అధ్యక్షులు కేజ్రీవాల్, నల్గొండ పార్లమెంటరీ నియోజకవర్గ ఇంచార్జి మహమ్మద్ అఫ్జల్ ఆదేశానుసారం స్వాతంత్ర్య సమరయోధులు, షహీద్ భగత్ సింగ్ 115వ జయంతి సందర్బంగా దేశవ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు రక్త దానం శిభిరాలు ఏర్పాటు చేసి, రక్తదానం చేయాలనీ వారు పిలుపునివ్వడం జరిగిందన్నారు.భగత్ సింగ్ 23 ఏళ్ల వయస్సులోనే దేశ ప్రజల కోసం ఉరికంబాన్ని ముద్దాడి, బ్రిటిష్ ప్రభుత్వం విధించిన ఉరి శిక్షణను సైతం లెక్క చేయని మహావీరుడన్నారు.భగత్ సింగ్ బ్రిటిష్ ప్రభుత్వ దోపిడీ పాలనకు ఏ విధంగా పోరాడారో ఆ పోరాట స్ఫూర్తితో నేటి యువత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆప్ సోషల్ మీడియా ఇంచార్జి కొంపెల్లి ప్రశాంత్ యాదవ్, జిల్లా నాయకులు కొచ్చెర్ల మధు, నాగరాజు, సంతోష్, వంశీ , శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.