భగలాముఖి అమ్మవారిని దర్శించుకున్న మా రెడ్డి శ్రీనివాస్ రెడ్డి చాగండ్ల నరేంద్రనాథ్ శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు


శివ్వంపేట జూలై 17 జనంసాక్షి : ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఇక్కడ లేనివిధంగా మండల కేంద్రమైన శివ్వంపేటలో ఆరు నెలల క్రితం దేదీప్యమానంగా నిర్మితమైన భగలాముఖీ శక్తిపీఠంలో సోమవారం అమావాస్య రెండు కలిసి రావడంతో ఇది సోమావతి అయ్యింది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు, నరేన్ గార్డెన్ అధినేత, చాగండ్ల నరేంద్రనాథ్, ప్రముఖ పారిశ్రామికవేత్త నందాకుమార్, సినీ ఇండస్ట్రీలో విలన్ నటులు లక్ష్మీనారాయణ లు సోమవారం భగలాముఖి శక్తిపీఠంలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ భగలాముఖి అమ్మవారి యొక్క చరిత్ర, విశేషాలను అమ్మవారి ఉపసకులు వెంకటేశ్వర శర్మ వారికీ తెలియజేశారు. ఆ తర్వాత అమ్మవారి పీఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వారికీ తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, చాగండ్ల నరేంద్రనాథ్ లు మాట్లాడుతూ మాట్లాడుతూ అనతి కాలంలోనే శ్రీ భగలాముఖి అమ్మ శక్తిపీఠం యొక్క ప్రాముఖ్యత ప్రజలలోకి వెళ్లిపోయిందని కొద్దిరోజుల వ్యవధిలోనే శివంపేట చరిత్రలో నిలిచిపోనున్నాదని ఆలయ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు. పబ్బా అంజయ్య- రామవ్వ దంపతుల జ్ఞాపకార్ధంగా బీఆర్ఎస్ జిల్లా సీనియర్ నాయకులు పబ్బా రమేష్ గుప్తా -స్వరూప దంపతులు, స్థానిక జెడ్పీటీసీ పబ్బా మహేష్ గుప్తా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమం ఈ సోమవతి అమావాస్యతో మూడవ నెలకు చేరుకుంది. శక్తి పీఠానికి వచ్చిన భక్తులందరూ శక్తి స్వరూపిణి అయిన భగలా ముఖీ అమ్మవారిని దర్శించుకుని వివిధ రకాల పూజలు చేపట్టి వారి మొక్కలు చెల్లించుకున్నారు. ఆ తర్వాత అన్నదానం కార్యక్రమం పాల్గొని భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ జిల్లా సీనియర్ నాయకులు శక్తిపీఠం స్థలదాత పబ్బా రమేష్ స్వరూప దంపతులు, వేద పండితులు రామశర్మ, సంతోష్ కుమార్ శర్మ, పురుషోత్తమ శర్మ, స్థానిక సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్, ఉప సర్పంచ్ పద్మా వెంకటేష్, వార్డు సభ్యులు పోచగౌడ్, కొండల్, పత్రాల దేవేందర్ గౌడ్ మొగుడంపల్లి భాస్కర్ గుప్తా, ఖధీర్ లతో పాటు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.