భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న హైకోర్టు జడ్జి
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 18(జనం సాక్షి)
వరంగల్ నగరంలోని చారిత్రక శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయంలోని అమ్మవారిని హైకోర్టు జడ్జ్ శ్రీదేవి( పోర్టు పోలియో )ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి పూజలు నిర్వహించారు. అంతకుముందు హైకోర్టు జడ్జి శ్రీదేవికి ఆలయ అర్చకులు మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. పూజల అనంతరం న్యాయమూర్తికి అమ్మవారి శేష వస్త్రాలను బహుకరించారు.
Attachments area