భద్రతా దళాల అకృత్యాలపై కన్నీరు పెట్టిన ఒమర

శ్రీనగర్‌ : సెక్యూరిటీ దళాల ఆకృత్యాలపై కాశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా కన్నీరు పెట్టారు. ఉత్తర కాశ్మీర్‌, బారాముల్లాలో సెక్యూరిటీ దళాల కాల్పుల్లో ఒకరు మరణించగా నలుగురు గాయపడిన సంఘటనపై మంగళవారం అసెంబ్లీలో విపక్షాలు నిలదీశాయి. దీంతో ఆయన ఒక్కసారిగా కన్నీటిపర్యంతమయ్యారు. కాల్పుల సంఘటన తర్వాత సైనికులు తమ ఇళ్లను దోపిడీ చేశారని ఆరోపిస్తూ భారీ సంఖ్యలో బారాముల్లా పట్టణవాసులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. సైనికులపై రాళ్లు రువ్వారు. తమపై దాడి జరిగిన తర్వాత ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపినట్లు సైనికులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు సైనిక ప్రతినిధి ఒకరు వెల్లడించారు. రాష్ట్రంలో ఎక్కడ మరణాలు సంభవించినా తననే నిందిస్తున్నారంటూ అబ్దుల్లా ఆవేదన వ్యక్తం చేశారు.