భద్రాచలంలో హనుమాన్ భక్తులకు నిలువు దోపిడీ
భద్రాచలం, ఖమ్మం : హనుమాన్ జయంతి సందర్భంగా భద్రాచలంలో భక్తులు నిలువు దోపిడీకి గురవుతున్నా… అలయ అధికారులు పట్టించుకోవడం లేదు. కల్యాణకట్ట వద్ద భక్తుల నుంచి రూ. 10కి బదులు రూ. 50 వసూలు చేస్తున్నారు. దీనిపై పలువురు అలయ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని భక్తులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.