భద్రాచలం ఆలయంలో ఘనంగా హనుమజ్జయంతి
ఖమ్మం : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో హనుమజ్జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హనుమాన్ భక్తులు పెద్దసంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. గోదావరి తీరంలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. హనుమజ్జయంతి సందర్భంగా ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ వేడుకలకు దాదాపు 40 వేల మంది భక్తుల వస్తారన్న అంచనాతో 3 లక్షల లడ్డూలను తయారు చేశారు. పులిహోరాను విక్రయించకుండా భక్తులకు ఉచితంగా అందించేందుకు నిర్ణయించారు. వేడుకల సందర్భంగా నేడు అలయంలో ఆర్జిత సేవలను నిలిపివేశారు.