భద్రాచలం ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ

ఖమ్మం : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి అలయానికి భక్తులు పోటెత్తారు. ఈ నెల 3న హనుమాన్‌ జయంతి సందర్భంగా భక్తులు పెద్దసంఖ్యలో మూడురోజుల ముందుగానే తరలివస్తున్నారు. ఉదయం నుంచే రామయ్య దర్శనానికి భక్తులు బారులుతీరారు. భక్తుల కోసం మూడు లక్షల లడ్డూ ప్రసాదాలను సిద్ధం చేసినట్లు ఆలయ అధికారులు చెప్పారు. అన్న ప్రసాదం టికెట్లు తేదీన 1500, మూడో తేదీన 2000 మంది భక్తులకు ఇవ్వనున్నారు.