భర్తను హతమార్చిన భార్య

కటకటాల పాలైన భార్య,
ఖానాపురం అక్టోబర్8జనం సాక్షి
 కుటుంబ కలహాలను మనసులో పెట్టుకొని నిండు నూరేళ్లు తోడు ఉండవలసిన భర్తను కట్టుకున్న భార్యథంప్స్ అప్ లో
 యాసిడ్ పురుగుల మందు కలిపి ఇచ్చి  భర్తను  హతమార్చి ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికఎస్ఐ పిట్టల తిరుపతి  తెలిపిన వివరాల ప్రకారం మండలంలో ని బుధరావుపేట గ్రామం శివార్లలోని బోడియా తండా కి చెందిన లకావత్ కవిత తన భర్త బాలు కి కుటుంబ కలహాలను మనసులో పెట్టుకొని తన భర్త ని ఎలాగైనా చంపాలనే ఉద్దేశ్యంతో గత నెల 10-09-2022 రోజున థంప్స్ అప్ లో ఆసిడ్ మరియు పురుగుల మందు కలిపి ఇవ్వగ అది తాగిన బాలు కి వాంతులు,వీరేచనాలు అవడంతో రెండు రోజుల తర్వాత నర్సంపేట ఏరియా హాస్పిటల్ కి  తీసుకెళ్లగా అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎం. జి . ఎం హాస్పటల్ కి గత నెల  16-09-2022  తీసుకెళ్లగా చికిత్స పొందుతూండగా బాలు తమ్ముడు లకావత్ రమేష్  ఫిర్యాదు మేరకు గత నెల  26-09-2022 న హత్యయత్నం కేసు నమోదు  చేసినట్లు ఎస్ఐ తిరుపతి ,బాలు చికిత్స పొందుతూ ఈనెల04.10.2022 రోజున రాత్రి 09:00 గంటలకు మృతి చెందినట్లు తెలుపుతూ ఇట్టి కేసుని మర్డర్ కేసు గా మార్చి, నిండుతురాలు లకావత్ కవిత w/o బాలుని ఖమ్మం జైలుకి రిమాండ్ తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.