భర్త గద్వాలకు భార్య జగిత్యాలకు

జిల్లాలోనే సింధుశర్మ పాఠశాల విద్య

జగిత్యాల,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): జిల్లా ఎస్పీగా నియమితులయిన .సి.హెచ్‌. సింధుశర్మ భర్త కూడా ఐఎఎస్‌ అధికారి కావడం విశేషం. ప్రస్తుతం ఆయన గద్వాల జోగులాంబ జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. మొన్నటి వరకు కరీంనగర్‌ మున్సిపల్‌ కమిషనర్‌గా పనిచేశారు. సింధుశర్మ భర్త కె.శశాంక జగిత్యాల సబ్‌ కలెక్టర్‌గా, కరీంనగర్‌ పురపాలక కమిషనర్‌గా పనిచేసి ప్రస్తుతం జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు. భార్యకు ముందు భర్త ఇక్కడే పనిచేయడం విశేషం. కొత్తగా ఎస్పీగా నియమితులైనసింధుశర్మ 2013లో ఐఆర్‌ఎస్‌కు ఎంపికై రెండో ప్రయత్నంలో 2014లో ఐపీఎస్‌ సాధించారు. శిక్షణ అనంతరం కరీంనగర్‌లో ట్రైనీ ఎ.ఎస్‌.పిగా పనిచేసి పెద్దపల్లి ఎ.ఎస్పీగా నియమితులయ్యారు. ప్రస్తుతం సెలవులో ఉన్న ఆమెను జగిత్యాల జిల్లా ఎస్పీగా నియమించారు. సింధుశర్మ తండ్రి ఉమామహేశ్వర్‌ శర్మ, మల్కాజ్‌గిరి డీసీపీగా పనిచేస్తుండగా గతంలో కోరుట్ల, సిరిసిల్ల సీఐగా పనిచేశారు. దీంతో సింధుశర్మ తన పాటశాల విద్యాభ్యాసాన్ని ఇక్కడే పూర్తి చేశారు. 6,7 తరగతులు కోరుట్లలో చదవగా, 10 తరగతి వరకు సిరిసిల్లలో చదివారు. హైదరాబాద్‌లో ఇంటర్‌ చదివిన అనంతరం నల్సార్‌ విశ్వవిద్యాలయం నుంచి న్యాయ విద్యలో పట్టా పొందారు. ఇప్పడుఉ ఇక్కడికే ఎస్పీగా రావడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే జగిత్యాల ఎస్పీగా పనిచేస్తున్న సునీల్‌ దత్‌ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీగా బదిలీ అయ్యారు.ఉత్తరాఖండ్‌కు చెందిన సునీల్‌దత్‌ వరంగల్‌ నిట్‌లో ఇంజినీరింగ్‌ చదివి 2014లో సివిల్స్‌కు ఎంపికై శిక్షణ అనంతరం ఆదిలాబాద్‌ జిల్లాలో ట్రైనీ ఎస్పీగా పనిచేశారు. మొదట భద్రాచలం ఎ.ఎస్పీగా నియమితులై గత మార్చి 14న జగిత్యాల జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. 5నెలల 15రోజులు పనిచేసిన ఆయన జిల్లాలో సౌమ్యుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు.