భవన నిర్మాణ కార్మికులకు లేబర్ ఇన్సూరెన్స్ కార్డును అందజేసిన నార్ల సురేష్
అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం డివిజన్ లోని భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ ఇన్సూరెన్స్ కార్డు కోసం దరఖాస్తు తన సొంత ఖర్చులతో చేయించానని సురేష్ సేవా సమితి వ్యవస్థాపకులు నార్ల సురేష్ వెల్లడించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులకు కొందరు లబ్ధిదారులకు గుర్తింపు కార్డులను మచ్చ బొల్లారం డివిజన్లోని తన కార్యాలయంలో అందజేయడం జరిగింది. అదేవిధంగా లేబర్ ఇన్సూరెన్స్ పాలసీ ఒకసారి 110 రూపాయలు చెల్లించి ఐదు సంవత్సరంల వరకు చెల్లించాల్సిన అవసరం లేదని తెల రేషన్ కార్డు ఉన్నవారు అందరు అర్హులే లేబర్ ఇన్సూరెన్స్ కార్డు ఉన్న లబ్ధిదారులు సహజ మరణం పొందితే ఒక లక్ష 30 వేల రూపాయలు ఇన్సూరెన్స్ అలాగే ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే ఆరు లక్షల రూపాయలు ఆడపిల్ల వివాహం జరిగితే 30 వేల రూపాయలు ఇలా ఇంకెన్నో సదుపాయాలు ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ప్రజలలో అవగాహన లేక ఈ పథకాలను సద్వినియోగం చేసుకోలేక పోతున్నారని వెంటనే ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు తెలిపారు.