భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలి
కడప,జూన్25(జనం సాక్షి ): భవన నిర్మాణ కార్మికులను చంద్రన్న బీమాతో కలపరాదని ఏఐటీయూసీ డిమాండ్ చేస్తోంది. సంక్షేమ నిధి నుంచి ఇతర అవసరాలకు మళ్లించిన నిధులను తక్షణమే సంక్షేమి నిధికి జమచేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. 55 ఏళ్లు నిండిన భవన నిర్మాణ కార్మికులకు నెలకు కనీస పింఛను రూ. 3 వేలు ఇవ్వాలని, గుర్తింపుగల కార్మికులందరికీ కార్మిక శాఖ ద్వారానే అన్ని క్లైమ్‌లు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఎన్నో పోరాటాల ఫలితంగాసాధించుకున్న భవన నిర్మాణ సంక్షేమ చట్టానికి తూట్లు పొడిచేలా ప్రభుత్వం కుట్రపన్నుతోందని, ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని అన్నారు.