భవాని మాత అమ్మవారి ఆలయ గేటు నిర్మాణానికి 35వేల విరాళం.
మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్.
తాండూరు అక్టోబర్ 2(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం ఇంద్రనగర్ హమాలి బస్తి చంద్ర టాకీస్ ఎదురుగా కొలువుదీరిన భవాని మాత ఆలయ గేటు నిర్మాణానికి మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ రూపాయలు 35వేల విరాలని అందజేశారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో తాండూర్ నియోజకవర్గ రైతులు సుఖసంతో షాలతో పాడి పంటలు సమృద్ధిగా పండాలని మనసారా అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.
నియోజకవర్గ ప్రజలకు మరియు రైతులకు ముందస్తుగా దసరా శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో భద్రప్ప, రాజు బీరప్ప, వెంకటేష్, మహేష్ ,హనుమప్ప, గౌరీ శంకర్ ,శివకుమార్, నరేందర్ ,శివకుమార్ రవికుమార్, నరేష్ కుమార్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.
Attachments area