భాజపా చీలికే కాంగ్రెస్‌కు లాభించింది: నారాయణ
హైదరాబాద్ : కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచిందని సంబరాలు జరుపుకోవడం సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. భాజపా మూడు ముక్కలుగా చీలిపోవడం వల్లే కాంగ్రెస్‌కు లాభించిందని తెలిపారు. కర్ణాటక గెలుపును కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌తో పోల్చుకోవడం అవివేకమన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రికి, మంత్రులకు సమన్వయంలేని కాంగ్రెస్ పార్టీ .. రానున్న ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్తుందని ప్రశ్నించారు. కర్ణాటకలో మైనింగ్ మాఫియా గాలి జనార్దన్‌రెడ్డికి పట్టిన గతే రాష్ట్రంలో మైనింగ్ , మద్యం మాఫియాను నడిపిస్తున్న వారికి పడుతుందన్నారు.