భాజపా నాయకులు మున్సిపల్ కార్యాలయం ముట్టడి
నిర్మల్: గృహనిర్మాణ అనుమతుల పన్నులను తగ్గించాలని డిమాండ్ చేస్తూ శనివారం నిర్మల్ మున్సిపల్ కార్యాలయాన్ని భాజపా నాయకులు ముట్టడించారు. నిర్మాణ అనుమతులపై 14 శాతం పన్నుల పెంచటంతో నిర్మాణదారులపై భారం పడుతుందని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నిక నిర్వహించలేని ప్రభుత్వం ప్రజలపై పన్ను భారాలు మోపుతుందని విమర్శించారు. అనంతరం మున్సిపల్ ఏఈ శ్రీనివాస్‌కు వినతి పత్రం ఇచ్చారు. కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షుడు రావుల రాంనాధ్, జిల్లా కార్యదర్శి రాంచందర్, ఉపాధ్యక్షుడు వడిసెల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.