భాజపా నేతలతో కమల్‌నాధ్‌ సమావేశం

న్యూఢిల్లీ: పార్లమెంటులో ఎఫ్‌డీఐలపై కొనసాగుతున్న ప్రతిష్టంభను తొలగించేందుకు యూపీఏ  ప్రయత్నాలు ముమ్మరం చేసింది, బుధవారం పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి కమల్‌నాధ్‌ పార్లమెంటులో భాజపా పక్షనేతలు సుష్మాస్వరాజ్‌, అరుణ్‌జైట్లీలతో సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం ఆయనవిలేకరులతో మాట్లాడుతూ పార్లమెంటులో యూపీఏకు తగినంత సంఖ్యాబలముందన్నారు. ఈ అంశంపై ఓటింగ్‌ పెట్టుకోవచ్చని ప్రతిపక్షాలకు ఇదివరకే యూపీఏ సూచించిన విషయం తెలిసిందే.