భాదనకుర్తి గోండు రాజుల చారిత్రాత్మక కట్టడాలను కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాము
బీజేపీ ఎంపీ సోయం బాపురావు
ఖానాపూర్ రూరల్ 2 అక్టోబర్ (జనం సాక్షి): బాధనకుర్తి గ్రామంలోని ఆర్క వంశీయులు గోండు రాజులు పాలించిన చారిత్రక కట్టడాలను ఆదివారం బీజేపీ ఎంపీ సోయం బాపు రావు సందర్శించారు.ఈ సందర్భంగా బాధనకుర్తి లోని గోండు రాజులు పాలించినప్పటి చరిత్రాత్మక కట్టడాలను సందర్శిస్తూ కోనేరు,విగ్రహాలు ఉన్నటువంటి ఈ ప్రదేశం బాధనకుర్తి కట్టడాలను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్తాను అని ఆయన అన్నారు.అక్కడ ఉన్న ఆర్క వంశీయులతో పూజలో పాల్గొన్నారు. అంతకు ముందు మస్కపూర్, బాధనకుర్తి దుర్గా మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.గాంధీ జయంతి సందర్భంగా గాంధీ చిత్ర పటానికి పుల మాలలు వేశారు.ఈ కార్యక్రమంలో ఖానాపూర్ బీజేపీ అసెంబ్లీ నాయకులు అజ్మీరా హరినాయక్,అసెంబ్లీ కన్వీనర్ పడాల రాజశేఖర్ కో కన్వీనర్ గడ్డం నంది రెడ్డి,పెంబి జెడ్పిటిసి బుక్యా జానకి రమేష్,ఖానాపూర్ మండల అధ్యక్షులు టేకు ప్రకాష్,బిజె వై ఎమ్ జిల్లా ప్రధానకార్యదర్శి పుప్పాల ఉపేందర్,ఉపాధ్యక్షుడు సందుపట్ల శ్రావణ్,సీనియర్ బీజేపీ నాయకులు తిరుమల గిరి,ప్రొద్దుటూరి గోపాల్ రెడ్డి,బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు.