భాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం నిత్యవసర సరుకులు పంపిణీ

మండల పరిధిలోని రత్నాపూర్ గ్రామానికి చెందిన పల్లి రామమ్మ అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఆర్థిక ప్రణాళిక సంఘం సభ్యులు, స్థానిక జడ్పిటిసి  పబ్బా మహేశ్ గుప్తా శనివారం ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. వారి కుటుంబానికి ఆయన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆ కుటుంబానికి అండగా ఉంటాననీ ప్రకటించి, తన సొంత నిధుల నుండి 2 వేల రూపాయల నగదు తోపాటుగా  నిత్యవసర సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, ఉప సర్పంచ్ పద్మా వెంకటేష్, వార్డు సభ్యులు పోచగౌడ్, కొండల్, నాయకులు గౌరీ శంకర్, దావూద్, అశోక్, రామమ్మ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.