భానుడి భగభగలు

విజయవాడలో 47 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత

హైదరాబాద్‌ : భానుడి ప్రతాపానికి రాష్ట్ర అగ్ని గోళంలా తయారవుతోంది. సూర్యని భగభగలకు ఈరోజు కొన్ని ప్రాంతాల్లో ఉదయం సమయానికే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. విజయవాడలో 47 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదయింది. నెల్లూరు 43.5, రామగుండం , కాకినాడలలో 46, నిజామాబాద్‌ 44, హైదరాబాద్‌ 42.4 డిగ్రీలు నమోదయ్యాయి.