భారత్ తో సీరీస్ కు ఇసురు ఆదానా, హెరాత్ లకు పిలుపు
కొలంబో, జూలై 16 : టీమిండియాతో జరగనున్న వన్డే సిరీస్ కోసం శ్రీలంక జట్టును ప్రకటించారు. 15 మంది జాబితాలో కొత్తగా లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ఇసురు ఉదానాకు చోటు దక్కింది. 24 ఏళ్ల ఉదానా లంక తరపున గతంలో ఆరు టీ ట్వంటీలు ఆడారు. అయితే ఇప్పటి వరకూ వన్డే జట్టులో మాత్రం చోటు దక్కలేదు. తాజాగా భారత్‌తో జరిగే సీరిస్ ద్వారా అతను వన్డే అరంగ్రేటం కూడా చేయనున్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్ లో మాత్రం ఉదానాకు మంచి రికార్డుంది. 2011-12 సీజన్‌లో 25.76 సగటుతో 26 వికెట్లు పడగొట్టాడు. అటు బ్యాట్స్‌మన్ చమర కపుదగరే కూడా జట్టులోకి తిరిగి వచ్చాడు. ఆసియాకప్ తర్వాత కపుగదరే జాతీయ జట్టుకు దూరమయ్యడు. అంతకుముందు పలువురు ఆటగాళ్లు గాయాల బారిన పడడంతో ఆసీస్‌లో జరిగిన సిబీ సీరిస్ ఫైనల్స్ కు కపుగదరే జట్టులోకి వచ్చాడు. అలాగే పాకిస్థాన్ తో చివరి మూడు వన్డేలకు విశ్రాంతి తీసుకున్న రంగన హెరత్ కూడా ఎంపికయ్యడు. కాగా పాక్‌పై ఆడిన ఫాస్ట్ బౌలర్లు దిల్హారా ఫెర్నాండో, నువాన్ ప్రదీప్, స్పిన్నర్ సాజీవా వీరాకూన్‌లకు నిరాశే మిగిలింది. ఈ ముగ్గురునీ లంక సెలక్టర్లు పక్కన పెట్టారు. జూలై 21 నుండి ప్రారంభం కానున్న సీరిస్‌లో భారత్, శ్రీలంక ఐదు వన్డేలు, ఒక టీ ట్వంటీ ఆడనున్నాయి.
భారత్ తో సీరిస్‌కు శ్రీలంక జట్టు
మహేళ జయవర్థనే(కెప్టెన్) ఆంగేలో మాథ్యూస్ (వైస్ కెప్టెన్), తిలకరత్నే దిల్షాన్, కుమార సంగర్కరా, ఉపుల్ తరంగా, దినేష్ చందిమాల్( వికెట్ కీపర్) , నువాన్ కులశేఖర, తిషార పెరీరా, లసిత్ తిరమన్నే, లసిత్ మలింగా, చమర కపుగదరే, రంగన హెరాత్, సచిత్ర సేనానాయకే, జీవన్ మెండిస్, ఇసురు ఉదానా.