భారత్‌, పాక్‌లు శాంతి,సహజీవనం కోరుకుంటున్నాయి

అ కొత్త వీసా విధానం, ద్వైపాక్షిక సంబంధం ,
తీవ్రవాదం, సరిహద్దులపై పాక్‌ హోంమంత్రి రహమాన్‌ మాలిక్‌, ప్రధాని మన్మోహన్‌ చర్చలు
న్యూఢిల్లీ, డిసెంబర్‌ 15 (ఎపిఇఎంఎస్‌): పాకిస్థాన్‌ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి రెహ్మాన్‌ మాలిక్‌ శనివారం నాడు ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో భేటీ అయ్యారు. ఇరువురు నేతలు పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. తన పర్యటనలో భాగంగా మాలిక్‌ విపక్ష నేత సుష్మాస్వరాజ్‌, జాతీయ భద్రతా సలహాదారుడు శివశంకర్‌ మీనన్‌తో కూడా నేడు భేటీ కానున్నారు. శుక్రవారం నాడు మాలిక్‌ భారత్‌కు వచ్చారు. ఆయన తొలి రోజు పర్యటన విజయవంతంగా ముగిసింది. మాలిక్‌ భారత పర్యటన సందర్భంగా అగ్రనేతలతో వివిధ అంశాలపై చర్చిస్తారు. కొత్త వీసా విధానం, ద్వైపాక్షిక సంబంధాలు, తీవ్రవాదం, సరిహద్దు అంశాలు చర్చల్లో చోటుచేసుకోనున్నాయి. భారత పర్యటన సందర్భంగా మాలిక్‌ మాట్లాడుతూ భారత్‌, పాకిస్థాన్‌ శాంతికాముక దేశాలని, సహజీవనం పట్ల విశ్వాసం ఉన్న దేశాలని ప్రపంచ వ్యాప్తంగా సందేశం ఇస్వామని ఆయన చెప్పారు. శాంతియుతంగా పొరుగు దేశాలు జీవించాలని కోరుకుంటున్నట్టు మాలిక్‌ తెలిపారు. ఇదిలా ఉండగా, పాకిస్థాన్‌ దేశంలోని జైలులో మగ్గుతున్న సరబ్‌జిత్‌ సింగ్‌ను విడుదల చేయాలని ఆయన సోదరి దల్బీర్‌కౌర్‌ పాక్‌ మంత్రి రేహ్మాన్‌ మాలిక్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.