భారత్‌ పాక్‌ టీ ట్వంటీ ఒక రోజు వాయిదా

ముంబై, డిసెంబర్‌ 15: భారత్‌-పాకిస్థాన్‌ జట్ల మధ్య జరగనున్న రెండో టీ ట్వంటీ మ్యాచ్‌ ఒకరోజు వాయిదా పడింది. షెడ్యూల్‌ ప్రకారం డిసెంబర్‌ 27న జరగాల్సి ఉండగా దీనిని మరుసటి రోజుకు వాయిదా వేశారు. డిసెంబర్‌ 27 పాక్‌ మాజీ ప్రధాని బెనజిర్‌ భుట్టో చనిపోయిన రోజు కావడంతో పిసిబీ అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు బోర్డు ప్రకటించింది. దీంతో అహ్మాదాబాద్‌ ఆతిథ్యమిస్తోన్న ఈ మ్యాచ్‌ డిసెంబర్‌ 28న జరుగుతుంది. మిగిలిన షెడ్యూల్‌లో ఎటువంటి మార్పులూ లేవని బీసిసిఐ తెలిపింది.మూడేళ్ళ తర్వాత భారత్‌-పాక్‌ జట్లు ద్వైపాక్షిక సిరీస్‌ ఆడబోతున్నాయి. డిసెంబర్‌ 22న పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టు భారత్‌కు రానుంది. స్వల్పకాలిక పర్యటనలో ఆ జట్టు రెండు టీ ట్వంటీలు, మూడు వన్డేలు ఆడనుంది. భారత ప్రభుత్వం పూర్తి భద్రతా ఏర్పాట్లు చేస్తోంది.