భారత్‌ విజయ లక్ష్యం 287 పరుగులు

కొలొంబో: భారత్‌-శ్రీలంకల మధ్య జరుగుతున్న మూడో వన్డేలో శ్రీలంక 5వికెట్ల నష్టానికి 286పరుగులు చేసింది. భారత్‌కు 287 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. శ్రీలంక ఆటగాళ్లలో తరంగ 8, దిల్షాన్‌4, సంగక్కర 73 జయవర్థన్‌ 65, మెండిస్‌ 45పరుగులు చేశారు. మ్యాథ్యూస్‌ 71పరుగులతో నాటౌటుగా నిలిచారు. భారత బౌలర్లలో జహీర్‌ఖాన్‌ 2, ఇర్ఫాన్‌ పఠాన్‌, దిండా, రాహుల్‌శర్మ తలో వికెట్‌ తీశారు.