*భారత్ జోడోయాత్ర సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తల ముఖ్య సమావేశం*
మెట్పల్లి టౌన్ ,అక్టోబర్ 15
జనంసాక్షి
తెలంగాణలో ఈ నెల 23వ తారీఖున రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను విజయవంతం చేయడానికి నేడు మెట్ పల్లి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో కోరుట్ల నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది సుప్రీంకోర్టు అడ్వకేట్ యువ నాయకులు కొమిరెడ్డి కరంచంద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ… దేశంలో ప్రధాని మోడీ ప్రభుత్వం మతకలహాలు సృష్టించి దేశాన్ని విభజించి పాలిస్తున్నదని, నిత్యవసరాలు ధరలు విపరీతంగా పెంచేసి, పేద, మధ్యతరగతి ప్రజలు నేడు బతకడమే దుర్లభంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జరిగే ఈ భారత్ జోడోయాత్ర చరిత్రలో నిలిచిపోనుందని అన్నారు. దేశ ప్రజలను చైతన్యవంతులు చేసి, కార్పొరేట్ దుష్ట శక్తుల ఉక్కు పిడికిల్లో బందీ అయిన ఈ దుష్ట పరిపాలనను అంతమొందించేందుకు సాగుతున్న ఈ భారత్ జోడోయాత్రను ఈనెల 23న తెలంగాణలో ప్రజలందరూ స్వాగతించి, భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు ఎర్రోళ్ల హనుమాన్లు, కాజా అజీమ్, పెంట ప్రణయ్, కంతి హరికుమార్ బర్ల వంశీ, ఎండి రజాక్, బర్ల అర్జున్, చిలువేరి శ్రీనివాస్, , నల్ల మహేష్ తదితరులు పాల్గొన్నారు.