భారత చరిత్ర పుటల్లో తొలిగిరిజన మహిళ
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎన్నికవడం హర్షణీయం.
గిరిజన మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి
కే, రాంజీ రాథోడ్.
తాండూరు జులై 22(జనంసాక్షి) భారత దేశ చరిత్ర పుటల్లో తోలిగిరిజన మహిళా
రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికవడం యావత్ భారత దేశ గిరిజనులకు గర్వించదగ్గ చారిత్రాత్మక ఘట్టం అని బిజెపి గిరిజన మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి కే. రాంజీ రాథోడ్ అభిప్రాయపడ్డారు .ఈ సందర్భంగా నూతన రాష్ట్రపతి గా ఎన్నికైన ద్రౌపది ముర్ముకి గిరిజన మోర్చ వికారాబాద్ జిల్లా శాఖ తరపున శుభాకాంక్షలు తెలిపారు .అదేవిధంగా ప్రధాని నరేంద్రమోడీ బిజెపి పార్టి జాతీయ అధ్యక్షుడు జే పీ నద్దా మరియు యన్ డి ఏ మిత్రపక్షాలకు ఇతర పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు, ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ భారత దేశ చరిత్ర లో తోలిగిరిజనమహిళ రాష్ట్రపతి గా ద్రౌపది ముర్ము ఎన్నికవడం హర్షణీయం అని యావత్ భారత గిరిజనులకు దక్కిన గౌరవం గా తము అభిప్రాయపడ్డారు .అదేవిధంగా సామాజిక న్యాయం కేవలం బిజెపి కే
సాధ్యం అని అరవై సంవత్సరాలు పరిపాలించిన
కాంగ్రెస్ పార్టీ కేవలం ఓటు బ్యాంకు గా గిరిజనులకు వాడుకుందని పేర్కొన్నారు. కెసిఆర్ ప్రభుత్వం గిరిజనులకు ఎన్నో హామీలు ఇచ్చి విస్మరించారని ప్రతేకించి పొడుభుముల విషయంలో గిరిజన రిజర్వేషన్ విషయంలోనూ తీవ్ర అన్యాయం చేశారు. రిజర్వేషన్ అంశం రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని
విషయం అని కావాలని ఉద్దేశపూర్వకంగా
రిజర్వేషన్ కల్పించ కుండా రిజర్వేషన్ అంశాన్ని కేంద్రంపై నెట్టి కాలయాపన చేస్తున్నారని విమర్శించారు.గిరిజనులపై కెసిఆర్ చిత్త శుద్ది , కపత ప్రేమను యావత్ తెలంగాణ గిరిజనులు గమనిస్తున్నారని నలభై నియోజక వర్గాల్లో గిరిజన ఓటు బ్యాంక్ ఉందని ప్రభుత్వ ఏర్పాటులో నిర్ణయాత్మక శక్తిగా గిరిజనులు ఉన్నారని బిజెపి రాష్ట్ర శాఖ పోడు భూముల సమస్యలు రిజర్వేషన్ అంశాలపై అలాగే ఇతర సమస్యలపై తిరుగులేని పోరాటం చేస్తుందని రాబోయే ఎన్నికల్లో బిజెపి గెలుపు ఖాయం అని
బిజెపి ప్రభుత్వం గిరిజన సమస్యలను
పరిష్కరిస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు.
స్థానిక తాండూర్ నియోజక వర్గంలో ఎమ్మెల్యే
ఎం యల్ సి వర్గపోరుతో గిరిజన సమస్యలను
విస్మరించారని ఇప్పటికీ అనేక గిరిజన తండాల్లో
కనీస సౌకర్యాలు లేక గిరిజనులు అనేక
సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో అధిష్టానం టికెట్ ఎవరికి ఇచ్చిన ఏక పక్షంగా బిజెపి పార్టిని గెలిపిస్తామని అభిప్రాయ పడ్డారు. స్థానిక ప్రజాప్రతినిధులు
గిరిజనుల సమస్యలను విస్మరిస్తే బిజెపి పార్టి ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఉద్యమాలు
నిర్వహిస్తామని హెచ్చరించారు