భారత టూర్‌కు వెటోరీ డౌటే
గాయం నుండి కోలుకోని కివీస్ స్పిన్నర్
వెల్లింగ్టన్, ఆగస్టు 6: భారత పర్యటనకు ముందు న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు మాజీ కెప్టెన్, స్పిన్నర్ డానియల్ వెటోరీ భారత్‌తో సిరీస్‌కు అందుబాటులో ఉండే అవకాశాలు కనిపించడం లేదు. గాయం నుండి ఇంకా కోలుకోకపోవడమే దీనికి కారణం… వెటోరీ భారత్ టూర్‌కు వచ్చే చాన్స్ 90 శాతం లేదని న్యూజిలాండ్ కెప్టెన& రాస్ టేలర్ ఇప్పటికే స్పష్టం చేశాడు. దీంతో అతని స్థానంలో కీవీస్‌కు ఆడుతోన్న తెలుగుతేజం తరుణ్ నేతులాకు ప్లేస్ ఖరారైనట్టే ..29 ఏళ్ల తరుణ్ కర్నూల్‌లో జన్మించాడు. అయితే చాలా ఏళ్ల క్రితమే న్యూజిలాండ్ లో స్థిరపడడంతో ఆ జట్టు తరపున ఆడుతున్నాడు. ఇప్పటి వరకూ ఈ స్పిన్నర్ ఐదు వన్డేలు ఆడాడు. ఇటీవలి వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు జట్టులో కూడా చోటు సంపాదించాడు. కాగా గత వారం విండీస్‌తో జరిగిన రెండో టెస్టులోనే వెటోరి గయపడ్డాడు. భారత్‌తో సిరీస్ సమరానికి కోలుకుంటాడని భావించిన సాధ్యం కాలేదు. దీంతో మరికొన్నాళ్ల పాటు విశ్రాంతికే పరిమితం కానున్నాడు. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టెస్టు బెంగళూర్‌లో జరగనుంది. ఇది ముగిసిన తర్వాత రెండు టీ ట్వంటీల సిరీస్ కూడా జరగనుంది. మొదటి టీ ట్వంటీకి విశాఖపట్నం, రెండో మ్యాచ్‌కు చెన్నై వేదిక కానున్నాయి.