భారత రాష్ట్ర సమితి చరిత్ర సృష్టిస్తున్న అని అన్న దేవి రవీందర్
కొండపాక (జనంసాక్షి) అక్టోబర్ 07: ముఖ్యమంత్రి కేసీఆర్ భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రకటించడం చరిత్రత్మక నిర్ణయం అని దేవి రవీందర్ అన్నారు.సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని లకుడారం గ్రామంలో శుక్రవారం రైతుబంధు సమితి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాష్ట్ర ఎంపీటీసీగా పోరం వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చుతు వాలని శుభసూచకం అని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతదేశానికి కొత్త జాతీయ పార్టీ కావాలని చెప్పి వివిధ రాష్ట్రాలు ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పుడు పాలిస్తున్నటువంటి బిజెపి ప్రభుత్వం కులం పేరుతో మతం పేరుతో ఓట్లు దండుకోవడం తప్ప రైతులు కార్మికులు కర్షకులు పేదల కష్టాలు తీర్చడంలో పూర్తిగా విఫలమైనది తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే సాధించుకున్నామో అదే స్ఫూర్తితో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ భారత దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడం ఖాయం అన్నారు.